Site icon HashtagU Telugu

Kamareddy : కామారెడ్డి లో గెలుపెవరిది..? ప్రజలు ఒక్క మాటలో తేల్చేసారు

Kamareddy Kcr Revanth

Kamareddy Kcr Revanth

తెలంగాణ అసెంబ్లీ (TS Polls) ఎన్నికలపైనే అందరి దృష్టి. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ (BRS)..హ్యాట్రిక్ కొడుతుందా..? లేదా..? అని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టిగా ఉండబోతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటారా..? లేక మరో ఛాన్స్ బిఆర్ఎస్ ఇస్తారా..? అనేది చూడాలి.

రాష్ట్ర ఎన్నికలు ఇలా ఉంటె..కామారెడ్డి (Kamareddy) లో విజయం ఎవరు సాదిస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి లోను కేసీఆర్ (KCR) పోటీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండు అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగుతుండడం తో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక చోట ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ రెండో స్థానాన్ని ఎంచుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసేందుకే ఆయన రెండో స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ ఫాంహౌస్ కూడా గజ్వేల్ పరిధిలోనే ఉంది. దీంతో అది ఆయన కంచుకోటగా మారింది. ఫాంహౌస్ లో నిత్యం ఆయన అందుబాటులో ఉంటున్నారు. గజ్వేల్ ప్రజలు కూడా కేసీఆర్ ను అక్కున చేర్చుకున్నారు. ఆయన కూడా గజ్వేల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. దీంతో గజ్వేల్ నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకుంటున్నారు.

అయితే కేసీఆర్ ఈసారి గజ్వేల్ కు మాత్రమే పరిమితం కాలేదు. కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగబోతున్నారు. మరోపక్క కాంగ్రెస్ నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ (Revanth) బరిలోకి దిగాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాదిస్తారనేది ఆసక్తి గా మారింది. అయితే కామారెడ్డి ప్రజలు ఎవరు రావాలని అనుకుంటున్నారు..? ఎవరికీ ఓటు వేస్తామని చెపుతున్నారు..? అనేది చూద్దాం.

Read Also : CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం విచారణ

Exit mobile version