Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయాలను ఇప్పుడు అందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆమె తదుపరిగా ఎమ్మెల్యే కావాలని యోచిస్తున్నారట. ఇందుకోసం మంచి అసెంబ్లీ సీటు కోసం వెతుకుతున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో ఏదైనా అసెంబ్లీ స్థానానికి బై పోల్ జరిగితే.. అక్కడ పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట. తద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని, బీఆర్ఎస్‌పై పట్టు సంపాదించాలని కవిత అనుకుంటున్నారట.
Also Read :Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?
జగిత్యాలలో యాక్టివ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే దిశగా కవిత(Kalvakuntla Kavitha) పావులు కదుపుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో జగిత్యాల స్థానాన్ని కాపాడుకోవాలని కవిత భావిస్తున్నారట. అవసరమైతే తానే ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుతో జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే, కాంగ్రెస్‌ను ఢీకొనాలంటే కవిత లాంటి అభ్యర్థే కరెక్ట్ అని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కవిత జగిత్యాలలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కులగణన, బీసీల రిజర్వేషన్లపై జగిత్యాల నుంచే ఉద్యమం మొదలవుతుందని వెల్లడించారు. జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే తానే బరిలో ఉంటానని తద్వారా కవిత సంకేతాలు ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Also Read :First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు
జగిత్యాలలో లెక్కలు ఇవీ..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యే సంజయ్‌కు జగిత్యాలలో సామాజికంగా, ఆర్థికంగా మంచి పట్టు ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఉన్నారు. దీంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే కవిత జగిత్యాలపై నజర్ పెట్టినట్టు తెలిసింది.