CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక

తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.

CAG Report: తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది. అంతేకాదు ఈ ప్రాజెక్టులో బీఆర్ఎస్ లావాదేవీలపై నివేదిక తయారుకు రంగం సిద్ధమైంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో స్థాపించి పునర్నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభ వ్యయంతో పోలిస్తే 400 శాతం పెరిగిందని కాగ్ నివేదించింది. నీటిపారుదల విస్తీర్ణాన్ని 50 శాతం పెంచే లక్ష్యంతో ప్రాజెక్టు వ్యయం కూడా రూ.38,000 కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెరిగింది. అయితే పెండింగ్‌లో ఉన్న అనేక పనులు ఇంకా పూర్తి కాలేదు. పెరిగిన ప్రాజెక్టు వ్యయంలో గణనీయమైన మొత్తాలను కాంట్రాక్టర్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జేబులో వేసుకున్నారని కాగ్ నివేదిక వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు నిర్వహణ విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.25,188.43 కోట్ల మేర లబ్ధి చేకూర్చిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రెండేళ్ళ క్రితం ప్రచురించిన కాగ్ నివేదికలో రీ-ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం ఆర్థికంగా లాభదాయకమేనని స్పష్టంగా పేర్కొంది.180 TMC అడుగుల నీటిని ఎత్తిపోసేందుకు 13,558 మిలియన్ యూనిట్ల వార్షిక ఇంధన అవసరాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో విద్యుత్ ఖర్చు యూనిట్‌కు రూ 3గా నిర్ణయించింది. వాస్తవానికి రూ. 6.4, డిస్కమ్‌లు లిఫ్ట్ చేయడానికి సరఫరా చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన పాత బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-ఇంజనీరింగ్‌తో ముందుకు సాగిందని కాగ్ నివేదించింది. కేవలం 16.4 లక్షల ఎకరాలకు మాత్రమే వైఎస్ రాజశేకర్ రెడ్డి ప్రతిపాదించిన కొత్త పథకాన్ని పోల్చి చూస్తే, కొత్త పథకం 24.96 లక్షల ఎకరాలకు ఉపయోగపడుతుందని, అయితే, ప్రాజెక్టు వ్యయం రూ. 1.2 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని కాగ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది.

Also Read: Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?