Kaleshwaram project : కాళేశ్వరం బ్యారేజీలపై విచారణకు నియమించిన కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు.. ఓ మంచి రికార్డు!
ఈనెల 23న జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫాలో మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కమిషన్ పూర్తి చేసే అవకాశం ఉంది. పరిస్థితిని బట్టి కొంత మంది ఇంజనీర్లు, అధికారులు, గుత్తేదార్లను విచారణకు పిలిచే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్.. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది.
Read Also: Sammelanam : ఓటీటీలో ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ రిలీజ్