Site icon HashtagU Telugu

Kaleswaram : కాళేశ్వరం కమిషన్‌ గడువు పెంపు

Kaleshwaram Commission deadline extended

Kaleshwaram Commission deadline extended

Kaleswaram: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరో నెలరోజులపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులను విచారించిన విషయం తెలిసిందే.

Read Also: KCR Vs BJP : కాంగ్రెస్‌ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!

ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకుంది. దాదాపు 90 శాతం నివేదిక సైతం కమిషన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తుది దశ విచారణలో భాగంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది. 100రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తొలుత 2024 మార్చి లో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆయా కారణాలతో విచారణ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో గడవు పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ ఏడాది మే 31 వరకు గడువు పెంచుతూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సదరు ప్రాజెక్ట్‌లోని పిల్లర్లు కృంగాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని.. అందుకే ఈ విధంగా కృంగిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అయితే తాము అధికారంలోకి వస్తే.. ఈ వ్యవహారంపై విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం.. అ నాటి సంఘటనలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకొన్న ఉన్నతాధికారులను విచారిస్తోంది.

Read Also: Pak airlines : పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేతకు కేంద్రం అడుగులు..!