Site icon HashtagU Telugu

KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?

Ktr

Ktr

KTR : తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాజకీయ కలకలం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇప్పటివరకు రాహుల్ గాంధీ సీబీఐని ప్రతిపక్షాల నిర్మూలన సెల్‌గా అభివర్ణించారు. అదే సీబీఐని ఇప్పుడు మీ సీఎం వాడుకుంటున్నారు. మీకైనా ఇది అర్థమవుతుందా? మాపై ఎన్ని కుట్రలు పన్నినా, మేము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని అన్నారు.

Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా శాసనమండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలి చైర్మన్ పోడియం ముందు బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నివేదిక ప్రతులను చించి మండలి చైర్మన్ వైపు విసిరారు. సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ “సీబీఐ విచారణ వద్దు” అంటూ గట్టిగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఈ విచారణలో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ వాడకం ద్వారా ప్రభుత్వమే ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు, ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులో అవినీతి వెలుగులోకి రావడానికి సీబీఐ విచారణ అవసరమని వాదిస్తోంది. ఈ పరిణామాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Yadagirigutta Temple : యాద‌గిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస

Exit mobile version