Kadiam Srihari:తనకు కాంగ్రెస్ పార్టీ(Congress party) నుంచి ఆహ్వానం వచ్చిందని… సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్‌లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడియం శ్రీహరితో పాటు కూతురు కడియం కావ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ… తన అనుచరులు, కార్యకర్తలతో పార్టీ మార్పు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. తనను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తన వెంటే ఉంటానని చెప్పారని వెల్లడించారు. తనతో వచ్చే ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన అనుచరుల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత సాయంత్రం వివరాలు వెల్లడిస్తానన్నారు.
Read Also: Health In Summer: ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
కాగా, కడియం శ్రీహరి ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు.
