Site icon HashtagU Telugu

Kadiyam Srihari : ఆరు నెలల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు – కడియం సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari

Kadiyam Srihari

స్టేషన్ ఘనపూర్ నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలిచిన కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేసారు. మరో ఆరు నెలల్లో..లేదా ఏడాది లో మళ్లీ కేసీఆరే (KCR) సీఎం కాబోతున్నారని..మన ప్రభుత్వమే రాబోతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోరంగా ఓటమి చవిచూసింది. రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్..మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం బిఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ (Congress) పార్టీ కి పట్టం కట్టారు. దాదాపు 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయడంఖా మోగించారు. బిఆర్ఎస్ పార్టీ కి కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక దాదాపు చాలావరకు మంత్రులు ఓడిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి నిన్న విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, ఆరు నెలలా.. సంవత్సరమా..చెప్పలేం కానీ మళ్లీ మన ప్రభుత్వమే రాబోతున్నదని, మన సీఎం కేసీఆరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పోటీకి పోటాబొటీ మెజార్టీ వచ్చింది. దాన్ని వారు కాపాడుకుంటారో లేదో చూద్దాం. ప్రజలు మార్పు కోరుకున్నారని ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు. కాగా త్వరలోనే కేసీఆర్ సీఎం కాబోతున్నారంటూ కడియం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

Read Also : T Congress : డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క..?