Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!

  • Written By:
  • Updated On - March 29, 2024 / 10:52 AM IST

Kadiyam Srihari: లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. నేడు స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్య‌తో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. ఈ మేరకు వీరు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, కావ్య కాంగ్రెస్ తరఫున వరంగల్‌ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశముంది. మరోవైపు కడియంకు రా.ష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడిన విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం సెర్చింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్య కడియం పోటీ నుంచి తప్పుకుంటాన‌ని గురువారం కేసీఆర్‌కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. పోటీ నుంచి తప్పుకోవడానికే ఇష్ట‌ప‌డుతున్నాన‌ని బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావుకు రాసిన లేఖలో డాక్టర్‌ కావ్య పేర్కొంది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

కడియం శ్రీహరి చాలా కాలం పాటు టీడీపీలో ఉండి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వంటి సీనియర్ పదవుల్లో పనిచేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వరంగల్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఏడాదిన్నర తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యేలా చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్.

We’re now on WhatsApp : Click to Join