Kadiam Srihari: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి హస్తం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. వరంగల్ జిల్లాలో ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఊరటగా చెప్పవచ్చు. అంతకుముందు కే కేశవరావు మరియు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గులాబీ పార్టీకి స్వస్తి చెప్పి శనివారం అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
Kadiam Srihari, Kavya
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయా పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్కు లేఖ రాసింది. అయితే కడియం సూచించడంతోనే కావ్య బీఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలుచుకోలేదని కడియం శ్రీహరి భావించారు. మరో వైపు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉండగా.. వరంగల్ టికెట్ కడియంకు వస్తుందా.. లేక ఆయన కూతురు కావ్యకు కేటాయిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
Alsso Read; Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య