Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన కుమార్తె కావ్య (Kadiyam Kavya)తో కలిసి ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌మున్షీ (Deepa Das Munshi) సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌ (Congress)లో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Warangal MP Kadiyam Kavya

Warangal MP Kadiyam Kavya

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన కుమార్తె కావ్య (Kadiyam Kavya)తో కలిసి ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌మున్షీ (Deepa Das Munshi) సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌ (Congress)లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ (BRS) టికెట్‌పై గెలుపొందారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నియోజకవర్గం నుంచి కావ్యను గులాబీ పార్టీ నామినేట్ చేసింది. కొద్ది రోజుల ముందు, కావ్య BRS టిక్కెట్‌పై పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసింది. తనకు గ్రౌండ్-లెవల్ నాయకుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదని.. సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి ఎక్కువ సీట్లు రావని అంచనా వేసి తన రాజీనామాను సమర్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను వెల్లడించింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. పొలంబాట కార్యక్రమం పేరుతో కేసీఆర్ (KCR) అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ ధ్వజమెత్తారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఆడుతున్నారన్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునెందుకు కేసీఆర్ ప్రయత్నమని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు కూడా రాని కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తు రావడం విడ్డూరమన్నారు. హీరోయిన్ ల ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజల సొమ్ము అంతా నీటి పాలు చేశారన్నారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కర్త కర్మ క్రియగా మారి నిర్మాణం చేయించాడని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కడుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి మీద మంచి మర్యాద లేకుండా కేటీఆర్ (KTR) మాట్లాడుతున్నారన్నారు కొండా సురేఖ.
Read Also : Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!

  Last Updated: 01 Apr 2024, 10:47 PM IST