భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు (Kadem Project) డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్రా 2.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది. అస్నా తూఫాన్ కారణంగా గత మూడు రోజులుగా తెలంగాణ లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఉంది. భారీగా పెరుగుతున్న వరద ఉధృతితో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పలు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.
మరోపక్క భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టినవారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలపై సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క , ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో సీఎం రివ్యూ చేశారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్‌చేసి రిజర్వాయర్లు నింపాలని ఆదేశించారు.
Read Also : Indrasena Reddy vs Samara Simha Reddy : ఇంద్రసేనా రెడ్డి vs సమర సింహా రెడ్డి.. రెడీ అంటే రెడీ..!