Site icon HashtagU Telugu

KA Paul: కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో పాదయాత్ర..!

Ka Paul

Ka Paul

తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేయడంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టారని, ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. అయితే ఏపీలో జగన్ క్రూరమైన నియంతృత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. షర్మిల కూడా తన సోదరుడి బాటలోనే పయనిస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పేర్కొన్న పాల్, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా సమయం ఉందని అన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. తాను వారం రోజులు అమెరికా వెళ్లొచ్చానని, ఈ లోపు తెలంగాణ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారని విమర్శించారు. గుజరాత్‌లో ఈవీఎంలు మార్చి బీజేపీ గెలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలలో బ్యాలెట్ పద్ధతిని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో రాజన్న రాజ్యాన్ని జగన్ తీసుకు రాలేదని, రాక్షస రాజ్యాన్ని తీసుకొచ్చారని అన్నారు.

Exit mobile version