Site icon HashtagU Telugu

KA Paul : తెలంగాణ ప్రభుత్వం ఫై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఆగ్రహం

KA Paul

KA Paul Sensational Comments on AP Government and Police in Vizag

ఎంపీ విజయసాయి (YCP MP MP Vijayasai Reddy) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడుతూ..తెలంగాణ లో ప్రభుత్వం పడిపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలే కాదు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. BJP అధికార ప్రతినిధివా.. మోదీకి తొత్తువా అంటూ మండిపడ్డారు. ఏపీలో 2, 3 నెలల్లో ఏమవుతుందో తెలుసా? అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికా? దోచుకోవడానికా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

మరోపక్క ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం విజయసాయి ఫై రాజ్యసభ చైర్మన్‌కి ఫిర్యాదు చేశారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడకూడదని, అలా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు తొలగించాలన్నారు. నాన్సెన్స్ అని ఎలా అంటారని నిలదీశారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశానని తెలిపారు. 33 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు కాంగ్రెస్ గురించే సాయిరెడ్డి మాట్లాడారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.

అలాగే, విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారని తెలిపారు. మోదీ సర్కారు ఆ హామీని నెరవేర్చలేదని, అయినప్పటికీ కాంగ్రెస్ తప్పు చేసిందంటూ విజయసాయిరెడ్డి కామెంట్లు చేస్తున్నారని ఠాగూర్ అన్నారు.

Read Also : Janasena : జనసేనను దెబ్బ తీసేందుకు భారీ కుట్ర..కనిపెట్టిన పవన్