Site icon HashtagU Telugu

KA paul: నా డబ్బుంతా అమెరికాలో ఉంది.. కేసీఆర్‌కు నేనంటే అందుకే భ‌యం!

Ka Paul

Ka Paul

ప్ర‌జాశాంతి పార్టీ (Prajasanthi Party) అధ్య‌క్షుడు కేఏ పాల్ (KA Paul) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాల‌న సాగుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ జరుగుతున్న అవినీతినీ ప్రశ్నించకుండా ఉండడానికి కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) మానవ హక్కులు కమిషన్ కమిషనర్ లేకుండా చేశారని ఆరోపించారు. ఆరు నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉంది. వారంరోజుల్లో మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని ప్ర‌భుత్వా పాల్ డిమాండ్ చేశారు. జస్టిస్ చంద్ర కుమార్ ను మానవ హక్కుల కమిషన్ గా ఉండండి.. మీ పేరు రిక మెండ్ చేస్తాను మీరు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా అంటూ మీడియా స‌మావేశంలో జస్టిస్ చంద్ర కుమార్ కు ఫోన్ చేసి పాల్ అడిగారు.

ధ‌ర‌ణి పేరుతో మా ఛారిటీ భూములను ఆగం చేశారని పాల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను తిట్టిన భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడని అన్నారు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. కేసీఆర్ అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్నా అని భయ పడి నన్ను కేసీఆర్ క‌ల‌వ‌డానికి ఒప్పుకోవ‌టం లేద‌ని పాల్ ఆరోపించారు. తెలంగాణ‌లో బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఒక్క‌టే. కేసీఆర్ త‌న మిత్రుడు కిష‌న్ రెడ్డికి అధ్య‌క్ష ప‌ద‌వి ఇప్పించుకున్నాడ‌ని పాల్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయ‌కులు రాష్ట్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మీరే అని అంటున్నారు. పేద ప్ర‌జ‌ల‌కోసం పోరాటం చేస్తున్నా కాబ‌ట్టి వాళ్లు అలా అంటున్నార‌ని పాల్ అన్నారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేను అధికారంలోకి రాగానే అంద‌రికీ డ‌బుల్ బెడ్రూంలు ఇస్తాన‌ని కేఏ పాల్ అన్నారు. నా డబ్బు అంత అమెరికాలో ఉంది ఆ డబ్బు తీసుకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. సదా శివాపేట పోలీస్ ను సస్పెండ్ చేయాలని మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ లో పిర్యాదు చేశాన‌ని పాల్ చెప్పారు.

Rajasthan Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్