Site icon HashtagU Telugu

Telangana CS : తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Telangana New Chief Secretary K Ramakrishna Rao Telangana Govt

Telangana CS : తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావు నియమితులు అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు సీఎస్‌‌గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్  30న పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కొత్త సీఎస్‌గా కె. రామకృష్ణారావును ఎంపిక చేశారు. నూతన సీఎస్ పోస్టు కోసం సీనియారిటీ ప్రకారం ఆరుగురు అధికారుల పేర్లను సీఎం రేవంత్ సర్కారు పరిశీలించింది. అయితే సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులను రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను(Telangana CS) బదిలీ చేశారు.

Also Read :Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Also Read :Terrorists Trekking : 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చి మరీ ఎటాక్