Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దోషులుగా తేలిన వ్యక్తులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, పారదర్శకతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.

కాళేశ్వరం విషయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చేసిన విమర్శలను ఉత్తమ్ తప్పు బట్టారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. కాళేశ్వరం పరిస్థితిని అంచనా వేయడానికి క్యాబినెట్ మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిందని, త్వరలో నివేదిక వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి ఆరోపణలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగిన పదేళ్లలో బీజేపీ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 3,500 రోజులు కలిసి పనిచేశాయని, అయినప్పటికీ నెల రోజుల కిందటే అధికారంలో ఉన్న కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఉత్తమ్. ప్రాజెక్టు వ్యయం రూ.80,000 కోట్ల నుంచి రూ.1.27 లక్షల కోట్లకు పెరిగినా బీజేపీ మౌనం వహించడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.. కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా అలా?