Site icon HashtagU Telugu

Jr Doctors Protest : తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె

Jr Doctors

Jr Doctors

జూనియర్‌ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మె (Junior Doctors protesting) రెండో రోజుకూడా కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు.

దీంతో నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రోగులు హాస్పటల్స్ లలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోపక్క జూడాల సమ్మెను దృష్టిలో పెట్టుకుని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని హాస్పటల్ వర్గాలు చెపుతున్నాయి. ఫ్యాకల్టీల సెలవులను రద్దు చేశాం. ఇప్పటికే సెలవులో ఉన్న ఫ్యాకల్టీలను సైతం అత్యవసరంగా వెనక్కి రప్పించాం. అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీల్లో ఫ్యాకల్టీ ఉండే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. దీని వల్ల రోగులపై సమ్మె ప్రభావం పెద్దగా లేదని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం రోజున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, డీఎంఈ తో చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమవడంతో యధాతథంగా సమ్మె నిర్వహిస్తున్నారు. శిక్షణ భృతి సకాలంలో అందించడం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం వంటి 8 ప్రధాన డిమాండ్‌లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై స్పష్టత రాలేదు. రెండో రోజు కోఠి మెడికల్ కళాశాల ముందు జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య కళాశాల్లో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. అలాగే వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also : Emergency Meeting : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ అదే