JP Nadda : తెలంగాణ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసిన జెపి నడ్డా

నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని సూచించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ , వైఫల్యాలు , పేపర్ లీకేజ్ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Jp Nadda

Jp Nadda

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్దర పడుతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈసారి తెలంగాణ లో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసపెట్టి బిజెపి అగ్ర నేతలు తెలంగాణా లో పర్యటిస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రీసెంట్ గా ప్రధాని మోడీ మహబూబ్ నగర్ , నిజామాబాద్ లలో పర్యటించగా..ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నగరానికి వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మేడ్చల్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన నడ్డా..బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసారు. నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని సూచించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ , వైఫల్యాలు , పేపర్ లీకేజ్ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది యువత జీవితాలు ఆగమయ్యాయని నడ్డా ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రధాని మోడీ (PM Modi) నేతృత్వంలోనే దేశం అగ్రగామిగా నిలిచిందని నడ్డా తెలిపారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13 కోట్ల మంది పేదరికాన్ని జయించారని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అబివృద్ధి చేయలేదని నడ్డా ప్రశ్నించారు. పీఎం అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందని, మరి తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారా? అని నిలదీశారు. ఉజ్వల పథకం కింద సిలిండర్‌కి రూ.300 సబ్సిడీ ప్రకటించామని, దీంతో 9.50 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని నడ్డా వెల్లడించారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్టని సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని నడ్డా ముఖ్య నేతలకు సూచనలు చేశారు.

Read Also : Rashmika-Ranbir: రణబీర్ తో రష్మిక ఫస్ట్ నైట్.. యానిమల్ మూవీకి హైలైట్ ఇదే!

  Last Updated: 07 Oct 2023, 03:51 PM IST