Whats Today : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నారాయణపేటకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. ఆ వెంటనే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
- రేపు (సోమవారం) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు.
- సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొని ప్రసంగిస్తారు.
- ఇవాళ మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఇల్లెందు, మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తగూడెం, సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకొని రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఎమ్మెల్సీ కవిత ఇవాళ ధర్మపురి పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొదట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. గొల్లపల్లి, పెగడపెళ్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కవిత మాట్లాడుతారు.
- జగిత్యాల జిల్లా ఎండపెళ్లి మండలం రాజారాంపల్లెలో కాంగ్రెస్ ప్రచార రోడ్ షోలో తీన్మార్ మల్లన్న పాల్గొంటారు.
- తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం జరగనుంది. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ(Whats Today) రద్దు చేసింది.