Site icon HashtagU Telugu

Congress : జోగులాంబ గద్వాల్ జిల్లాలో BRSకి షాక్.. ZP చైర్మన్‌తో సహా భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు..

Jogulamba Gadwal ZP Chairman Saritha and Some other BRS Leaders joined in Congress

Jogulamba Gadwal ZP Chairman Saritha and Some other BRS Leaders joined in Congress

తెలంగాణ(Telangana)లో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతున్నారు నేతలు. పార్టీలు కూడా పక్క పార్టీలలో అసంతృప్తి నాయకులని తమ పార్టీల్లో చేర్చుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల జోష్ రావడంతో కాంగ్రెస్(Congress) లోకి పలువురు నాయకులు తమ అనుచరులతో వస్తున్నారు. ఎక్కువగా BRS నుంచే కాంగ్రెస్ లోకి వలసలు ఉండటంతో ఎలక్షన్స్ ముందు BRS పార్టీకి గట్టి దెబ్బే తగిలేటట్టు ఉంది.

తాజాగా జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal) జిల్లా పరిషత్ చైర్మన్(ZP Chairman), బీఆర్ఎస్(BRS) నేత సరిత, ఆమె భర్త తిరుపతయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, మరో 5 గ్రామాల సర్పంచ్ లు, ఇతర నేతలు BRS నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన అనంతరం జోగులాంబ గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ నన్ను నా పని చేయనీయట్లేదు. సొంతంగా పనిచేసే వాతావరణం అక్కడ లేదు. అందుకే కాంగ్రెస్ లో చేరాను. శక్తిపీఠం ఉన్న జోగులాంబ జిల్లాలోనే మహిళకు స్వేచ్చగా పనిచేసే పరిస్థితి లేదు. నాలాగా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అందరూ బయటకు వస్తారు అని తెలిపింది.

అలాగే వీరితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మరికొందరు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అందుకే ఆ పార్టీలో చేరాను. బాల్కొండ నియోజకవర్గంలో మాత్రమే కాదు, జిల్లా, రాష్ట్రం అంతటా పార్టీ కోసం పనిచేస్తాను అని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తెలిపారు.

 

Also Read : KTR: భారీ వర్షాల ఎఫెక్ట్.. రైతు నిరసన కార్యక్రమాలు వాయిదా!