New Governor : తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం

ఇటీవల దేశంలోని 9 రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆ క్రమంలో కొత్త గవర్నర్‌ తెలంగాణకు వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Jishnu Dev Varma sworn in as the new Governor of Telangana

Jishnu Dev Varma sworn in as the new Governor of Telangana

Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పలువురు కిషన్‌రెడ్డి సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. త్రిపుర రాజకుటుంబానికి చెందిన వారు. 66 ఏళ్ల జిష్ణుదేవ్ వర్మ 1990లో బీజేపీలో చేరారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వర్మ త్రిపుర డిప్యూటీ సీఎంగానే కాకుండా భారత బ్యాడ్మింటన్ అసోషియేషన్‌కి అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయనను తెలంగాణకు గవర్నర్‌ని చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. తెలంగాణకు చెందిన వ్యక్తిని త్రిపుర గవర్నర్‌గా, త్రిపురకు చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా కేంద్రం నియమించడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని చర్చించుకుంటున్నారు.

Read Also: Pawan Kalyan : సినిమా షూటింగ్స్‌కి పవన్.. ముందుగా ఆ సినిమానే..!

 

 

  Last Updated: 31 Jul 2024, 07:44 PM IST