Site icon HashtagU Telugu

JEE Main Result 2024: జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

JEE Main Result 2024

JEE Main Result 2024

JEE Main Result 2024: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్‌ సాధించారు. 100 శాతం పర్సంటైల్‌ సాధించిన వారిలో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులే కావడం గమనార్హం. వివరాలలోకి వెళితే..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు 100 పర్సంటైల్‌లతో సంపూర్ణ 100 మార్కులు సాధించారు. ఏడుగురు విద్యార్థులలో రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హుండేకర్ విదిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి మరియు తవ్వా దినేష్ రెడ్డిలు పేపర్ -1 (BE/B.Tech)లో 100 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఈ పరీక్షలో దేశంలోనే అత్యధికంగా 100 పర్సంటైల్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

దేశవ్యాప్తంగా జనవరి 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 12,21,615 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11,70,036 మంది హాజరయ్యారు. దేశంలో మొత్తం 23 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు.అందులో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలే వారే కావడం హర్షించదగ్గ విషయం.

Also Read: Tillu Square Trailer : టిల్లు స్క్వేర్ ట్రైలర్.. పిచ్చెక్కించేందుకు వచ్చేస్తున్నాడహో..!