Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది.

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది. అందుకు సీఎం కేసీఆర్ తో ఆ నాయకులూ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ వచ్చింది. మరి ఈ సారి అలాంటివేం జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సిపిఎం సొంతంగా పోటీ చేయాలనీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 14 మందితో తొలి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.

అభ్యర్థుల ప్రకటన వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 14 సీట్ల పేర్లు ప్రకటించామని, మరో మూడు సీట్లపై చర్చలు జరుగుతున్నాయని మిగిలిన సీట్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని చెప్పారట. అయితే సిపిఎం అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం జానా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తో మాట్లాడటం తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధపడగా, సీపీఐ మాత్రం పోరాటానికి దిగేందుకు సంప్రదింపులు కొనసాగిస్తోంది. సీపీఐకి ఒక స్థానంతో పాటు ఎమ్మెల్సీ కూడా పోటీ చేసే అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల అంగీకరించినట్లు సమాచారం.

సీపీఐ కూడా పొత్తుతో ముందుకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపాలని దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. అయితే పొత్తు, సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: Hyderabad : ఎంఐఎం ఎమ్మెల్యేపై ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసు న‌మోదు