Site icon HashtagU Telugu

Janareddy : జానారెడ్డి నామినేషన్ ను రిజెక్ట్ చేసిన ఎన్నికల అధికారులు

Janareddy

Janareddy

తెలంగాణలో నామినేషన్ల (Nominations) పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) కి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈయన తో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 28 నామినేషన్లు దాఖలు చేసారు. వీరిలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. అందులో జానారెడ్డి పేరు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే నామమాత్రంగానే తాను నామినేషన్ వేసినట్లు జానారెడ్డి చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో చాలావరకు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్‌ మానకొండూరులోనూ ఏడుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా.. 18మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు.

Read Also : Point of Contact : జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణలో మరో ముందడుగు