Site icon HashtagU Telugu

BC Reservation : 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం – కవిత

Kavitha Bc

Kavitha Bc

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) పెంపు కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ధీటుగా స్పందించారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రాజకీయ రిజర్వేషన్ల గురించి మాత్రమే ప్రస్తావించిన ప్రభుత్వం, విద్యా మరియు ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక గడువు ఇస్తున్నామని, హైకోర్టులో కేవియట్ వేసి వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Tej Pratap Yadav : ఆసక్తికరంగా బీహార్‌ రాజకీయాలు.. తండ్రికి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్..!

ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రకటించడం జాగృతి ఉద్యమ విజయానికి నిదర్శనం. అయినప్పటికీ ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేకపోయారో ప్రశ్నించారు. కేంద్రం సహకారంతో 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని కోరుతూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ముందుగా ముందుకు వచ్చి బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేయించేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో హక్కులు లభిస్తాయని వివరించారు.

రైల్ రోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కవిత, గవర్నర్ ఆర్డినెన్స్‌పై సంతకం పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థ చాలా రాష్ట్రాల్లో న్యూట్రల్‌గా ఉండడం లేదని, బీసీల హక్కుల విషయంలో మర్యాదగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందా లేదా అన్నది వారం రోజుల్లో తేలిపోతుందన్నారు. లేదంటే తమ పోరాటం మరింత ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు.