Site icon HashtagU Telugu

Jaggareddy – The Leader : జననేత జగ్గారెడ్డి గెలుపు.. సంగారెడ్డి అభివృద్ధికి మలుపు

Jaggareddy

Jaggareddy

Jaggareddy – The Leader :  తూర్పు జగ్గారెడ్డి.. సంగారెడ్డి నియోజకవర్గంలో  పరిచయం అక్కరలేని పేరు. ఆ మాటకు వస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అత్యధికులు ఇష్టపడే వ్యక్తి.. కారణం ఆయన స్వభావం.. పేదల పట్ల జగ్గారెడ్డికి ఉన్న సానుభూతి, జనం కష్టాల పట్ల ఆయన స్పందించే స్వభావం చాలా గొప్పవి. డబ్బు జేబులో ఉండాలే కానీ పేదలకు పంచి కానీ ఇంటికి వెళ్లని పేదల పాలిట పెన్నిధి జగ్గారెడ్డి.. ఆయన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా వెన్నంటి నడిచిన వ్యక్తి.. రాహుల్ గాంధీతో తెలంగాణలో సభలు ఏర్పాటు చేయించడంలోనూ జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారు.  రాహుల్ గాంధీ పాదయాత్రలో వెన్నంటి నడిచిన వ్యక్తిగా జగ్గారెడ్డికి పేరుంది.

We’re now on WhatsApp. Click to Join.

రాహుల్ గాంధీ అత్యంత ప్రేమగా జగ్గారెడ్డి భుజం మీద చేయివేసి.. సింహం లాంటి లీడర్ జగ్గారెడ్డి, ఆయన్ని గెలిపించండని ప్రజలను కోరారు. జగ్గారెడ్డి భుజంపై చేయి వేసి రాహుల్ మాట్లాడటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. సాధారణంగా రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నా ఎక్కడ కూడా ఏ లీడర్‌పైనా ఈవిధంగా భుజంపై చేయి వేసుకొని మాట్లాడలేదు. జగ్గారెడ్డికి ప్రజా బాహుళ్యంలో చాలాచాలా సానుకూల పవనాలు వీస్తున్నాయి. అన్ని సర్వే నివేదికలు కూడా సంగారెడ్డిలో జగ్గారెడ్డి విజయం తథ్యమని ఢంకా బజాయించి చెబుతున్నాయి.

Also Read: Telangana Elections 2023: తగ్గిన అక్బరుద్దీన్ ఆస్తులు..పెరిగిన 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు

తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానాల్లో సంగారెడ్డి కూడా ఒకటి. జగ్గారెడ్డి లాంటి నిజాయితీపరుడు, నిష్కలంకుడిని గెలిపించి అసెంబ్లీకి పంపించగలిగితే సంగారెడ్డి పంట పండినట్టే.  జగ్గారెడ్డి చిరకాల వాంఛ అనేది ముఖ్యమంత్రి పదవి. సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఆయనను గెలిపించడం ద్వారా ఆ దిశగా అవకాశం కల్పించినట్లు(Jaggareddy – The Leader ) అవుతుంది.