Jagga Reddy : కాంగ్రెస్ పార్టీకి బలం ‘జగ్గారెడ్డి’

జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న లేకపోయినా స్టైల్ మాత్రం ఒక్కటే...

  • Written By:
  • Updated On - November 27, 2023 / 06:11 PM IST

సంగారెడ్డి (Sangareddy) జయప్రకాశ్ రెడ్డి..అంటే చాలామందికి తెలియదు..కానీ జగ్గారెడ్డి (Jagga Reddy) అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తాడు. పెద్ద వెంట్రుకలు, గుబురు గడ్డమే అందరికి ముందుగా గుర్తుకు వస్తుంది.. ఆ ఎయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు కూడా అంతే గంభీరంగా ఉంటాయి. మాట తీరు కూడా పక్కా లోకల్ అండ్ మాస్..! ప్రత్యర్థి పార్టీలనే కాదు, పలు అంశాల్లో సొంత పార్టీ నేతలను కూడా కడిగిపారేస్తారు. అందుకే జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న లేకపోయినా స్టైల్ మాత్రం ఒక్కటే…

We’re Now on WhatsApp. Click to Join.

సంగారెడ్డి (Sangareddy) జిల్లా, కంది మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో 1966, జూలై 7న జగ్గారెడ్డి – జామాయమ్మ దంపతులకు జగ్గారెడ్డి (Jagga Reddy) జన్మించారు. పదోతరగతి వరకు చదువుకున్న జగ్గారెడ్డి (జయప్రకాశ్ రెడ్డి)..మొదటి నుండి రాజకీయాల్లో రాణించాలని కోరికతో పెరిగాడు. 1986లో బిజెపి తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరుపున పోటీచేసి తన సమీప ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థి కె. సత్యనారాయణపై 17,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌గా పనిచేశాడు. 2014 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

2014లో లోకసభ ఎన్నికలకు ముందు బిజెపి (BJP) లో చేరి ఆ పార్టీ తరఫున మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి బిఆర్ఎస్ (BRS) చేతిలో ఓడిపోయారు. మెదక్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన తరువాత 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2018 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తర్వాత శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.

తెలంగాణ కాంగ్రెస్‌ (T Congress)లో కీలక నేతగా పేరున్న జగ్గారెడ్డికి రాజకీయాలే కాదు దైవభక్తి ఎక్కువే. పూజల్లో నిత్యం పాల్గొంటారు. వినాయక చవితి, దేవి నవరాత్రుల వస్తే భారీగా చందాలు రాస్తుంటారు. ఇక దసరా వస్తే సంగారెడ్డిలో జగ్గారెడ్డిది పెద్ద సందడే ఉంటుంది. గతంలో పలుసార్లు తిరుమలకు పాదయాత్రకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

Also Read:  Jagga reddy – The Leader : జననేత జగ్గారెడ్డి గెలుపు.. సంగారెడ్డి అభివృద్ధికి మలుపు

ఇక వివాదాలకు కూడా జగ్గారెడ్డి (Jagga Reddy) కేరాఫ్ గా నిలుస్తుంటారు. నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాజ‌కీయాల‌ను జగ్గారెడ్డి వేడెక్కిస్తుంటారు. ఆ మధ్య జగ్గారెడ్డి వేసుకున్న షర్ట్ ఆయన్ను వివాదంలోకి నెట్టిందంటే చూడండి ఆయననే ఎంత క్రేజో. ఏకంగా 35 వేల రూపాయ‌ల అత్యంత ఖ‌రీదైన చొక్కాను జ‌గ్గారెడ్డి ధరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా జగ్గారెడ్డి పెద్ద‌గా క‌ట్టు బొట్టుకు ప్రాధాన్యం ఇవ్వ‌రు. సాధార‌ణ దుస్తులే ధరిస్తారు. అలాంటి ఆయన ` కెన్జో షర్ట్`(అత్యంత ఖ‌రీదైన‌) ధరించి అసెంబ్లీకి వెళ్లడం.. ఎప్పుడు తెలుపు షర్ట్ లేదంటే టీ షర్ట్‌తో వచ్చే జగ్గారెడ్డి క్యాజువల్‌లో రావడంతో అంద‌రి దృష్టీ ఆయ‌న‌పై ప‌డింది. ఎందుకు వేసుకున్నారని మీడియా వారు ప్రశ్నించగా..‘‘నేను విలువైన షర్ట్ వేసుకోకూడదా..’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. చొక్కాలు లేకపోవడంతో తన కుమారుడి షర్ట్ వేసుకుని వచ్చానని జగ్గారెడ్డి తీరగ్గా అసలు విషయం బయటపెట్టారు. ఇలా కూడా జగ్గారెడ్డి వార్తల్లో నిలిచారంటే ఆయన అంటే ఎంత క్రేజో అర్ధం చేసుకోవాలి.

ఇక కాంగ్రెస్ పార్టీ కి జగ్గారెడ్డి నే బలం. జగ్గారెడ్డి కి రాహుల్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇది పలుమార్లు బయటపడగా..తాజాగా ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. రాహుల్ గాంధీ సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకొని భుజంపై చేయి వేసి మెచ్చుకున్నారు. అంతకుముందు ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ… జగ్గారెడ్డి పెద్దపులి అని ప్రశంసించారు. ఆయన కష్టపడి పని చేస్తారని, భారత్ జోడో యాత్రలో ఆయన ఎలా కష్టపడి పని చేయడం చూశానన్నారు.

ప్రస్తుతం సంగారెడ్డి బరిలో నిల్చున్న జగ్గారెడ్డి..ఈసారి భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డి ని వదులుకోరు..ఆయన ఏ పార్టీ లో ఉన్న సరే ప్రజలు మాత్రం నిత్యం ఈయన వెంటే ఉంటూ జగ్గారెడ్డే మా బలం అని చెపుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి సైతం జగ్గారెడ్డి నే బలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  Rythu Bandhu : రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం – కేసీఆర్