Telangana: కర్ణాటక కరెంట్ తీగలను పట్టుకోవడానికి నేను రెడీ

తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, అధికార పార్టీ బీఆర్ఎస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో కరెంట్ వైర్లను పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని

Telangana: తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, అధికార పార్టీ బీఆర్ఎస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో కరెంట్ వైర్లను పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. కర్నాటకలో 18 గంటల పాటు విద్యుత్ లైన్లను పట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణలో ఒక్క నిమిషం అయిన కరెంట్‌ లైన్లను పట్టుకునే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో జగదీశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ వైర్లు పట్టుకుని తమ వాదనల్లో నిజానిజాలను పరీక్షించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. 2014కి ముందు తర్వాత తెలంగాణలో విద్యుత్ సరఫరా పరిస్థితికి మధ్య ఉన్న తేడాని గమనించాలని మంత్రి కాంగ్రెస్ నేతలను కోరారు. విద్యుత్తుపై వారి ఆరోపణలు అవాస్తవమని జగదీష్ రెడ్డి అన్నారు.

Also Read: Hyderabad: నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం

Follow us