Site icon HashtagU Telugu

Serilingampally Jagadeeshwar Goud : మచ్చ లేని మహారాజు ‘జగదీశ్వర్ గౌడ్’

Serilingampally Jagadeeshwar Goud Election

Jagadeeshwar Goud Election

Jagadeeshwar Goud : ఈసారి తెలంగాణ ఎన్నికలు (TS Polls) కాకరేపుతున్నాయి. గత రెండుసార్లు ఎన్నికలు ఒత్తైతే..ఈసారి ఎన్నికలు మరో ఎత్తు. కాంగ్రెస్ (Congress) – బిఆర్ఎస్ (BRS) రెండు కూడా పోటాపోటీగా ఉన్నాయి. పదేళ్ల అభివృద్ధి చూసి మరోసారి బిఆర్ఎస్ కు ఓటెయ్యండి అని బిఆర్ఎస్ అంటుంటే..మార్పు రావాలి..కాంగ్రెస్ కావాలి అంటూ కాంగ్రెస్ అంటుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ (TRS) రెండుసార్లు అత్యధిక స్థానాలతో అధికారం చేపట్టింది. రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీ కి అధికారం ఇచ్చిన ప్రజలు ఈసారి ఎవరికీ ఇస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ పదేళ్ల లో దేశంలోనే తెలంగాణ ను నెం 1 స్థానంలోకి తీసుకొచ్చామని , ఏ రాష్ట్రంలో చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని , ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని బిఆర్ఎస్ ప్రచారం చేస్తూ మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే..కాంగ్రెస్ పార్టీ మాత్రం ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని , ప్రాజెక్ట్ ల పేరుతో వేలకోట్లు స్కామ్ చేసారని , నిరుద్యోగ యువతికి జాబ్స్ ఇవ్వకుండా వారి ఆత్మహత్యలకు కారణమయ్యాడని ఆరోపిస్తూ..కాంగ్రెస్ పార్టీ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అసలైన తెలంగాణ ను తీసుకొచ్చి చూపిస్తామని ప్రచారం చేస్తుంది. మరి ఈ రెండు పార్టీలే ప్రధానంగా బరిలో పోటీపడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రాష్ట్రం మొత్తం ఎన్నికలు హోరు ఒకెత్తయితే..శేరిలింగంపల్లి (Serilingampally) హోరు మరొత్తు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య పరంగా అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేరిలింగంపల్లి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్న ఈ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 6,98,079 మంది ఓటర్లున్నారు. ఇక్కడ పురుష ఓటర్లు 3,70,301 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 3,27,636. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 142 మంది ఉన్నారు. ఇక ఈసారి ఎన్నికల బరిలో అధికార పార్టీ బిఆర్ఎస్ నుండి అరికపూడి గాంధీ (Arekapudi Gandhi ), కాంగ్రెస్ నుండి జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud), బిజెపి నుండి రవి కుమార్ యాదవ్ (Ravikumar Yadav) లు బరిలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జగదీశ్వర్ గౌడ్ హావ బాగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఆయనకు బ్రహ్మ రథంపడుతున్నారు. 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాదాపూర్ డివిజన్‌ కార్పొరేటర్‌గా తొలిసారి జగదీశ్వర్ గౌడ్ గెలిచాడు. ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరి 2016, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి 107 డివిజన్‌ మాదాపూర్ డివిజన్‌ కార్పొరేటర్‌గా విజయం సాధించి ప్రజల మనిషి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్పొరేటర్‌గా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..వారి సమస్యలను తీరుస్తూ..వారి కష్ట సుఖాలను పంచుకున్నాడు. అప్పటి నుండి కూడా నియోజకవర్గంలో జగదీశ్వర్ గౌడ్ కు ఎంతో గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్యేగా జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud) ను చూడాలని ప్రజలు కోరుకుంటూ వస్తున్నారు.

Also Read:  Telangana: ఎన్నికలపై కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గిన మందు పార్టీలు, అభ్యర్థులు ఫుల్ జోష్!

2018లో శేరిలింగంపల్లి (Serilingampally) ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, పార్టీ నచ్చజెప్పడంతో ఆయన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఈసారి కూడా టికెట్ ఆశించినప్పటికీ గులాబీ బాస్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి శేరిలింగంపల్లి (Serilingampally) ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాడు. శేరిలింగంపల్లి లో ప్రధానంగా నీటి సమస్య ఉండడంతో ఆ సమస్యను ఖచ్చితంగా తీరుస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు , చెరువులు , కుంటలు కబ్జాలకు గురయ్యారని జగదీష్ ఆరోపిస్తూ..మళ్లీ అలాంటి కబ్జాలు జరగకుండా చూసుకునే బాధ్యత తనదే అని హామీ ఇస్తున్నారు. రోడ్లు , డ్రైనేజ్ , ఇలా ఏ సమస్య వచ్చిన అది తీర్చే బాధ్యత తనదే అని…కార్పొరేటర్ గా ప్రజలకు ఎంతో సేవ చేశా..ఎమ్మెల్యేగా అంతకు మించి సేవ చేస్తానని.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud) చెపుతున్నారు.

కార్పొరేటర్ మూడు సార్లు విజయం సాధించిన జగదీశ్వర్ గౌడ్..ఓ మచ్చ కూడా లేని నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మాములుగా ఎవరైనా కార్పొరేటర్ గా విజయం సాధిస్తే తన ఆస్తులు పెంచుకోవడం..ప్రజల సమస్యలు పెద్దగా పట్టించుకోకపోవడం చేస్తారు కానీ కానీ జగదీశ్వర్ గౌడ్ మాత్రం ఉదయం ఆరు గంటలకే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం..ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చేసి ఆ సమస్యలను తీరుస్తుంటారు. అందుకే జగదీశ్వర్ గౌడ్ ను అంత మచ్చలేని మహారాజు అంటూ కొనియాడుతారు.

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని..ప్రజలు కోరుకునే అసలైన తెలంగాణ ను కాంగ్రెస్ తీసుకొస్తుందని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే శేరిలింగంపల్లి (Serilingampally) నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తో తన గెలుపు ఖాయమని చెపుతూ వస్తున్నారు.

Also Read : AP News: ఏపీలో 103 కరువు మండలాలు, రైతుల పంట నష్టం గణన