Banakacharla Project : వైయస్సార్ ఏమో కృష్ణా ను తీసుకెళ్లాడు..బాబు ఏమో గోదావ‌రిని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు – జగదీష్

Banakacharla Project : కాంగ్రెస్, టీడీపీ కలిసి మళ్లీ తెలంగాణ ప్రజలపై ద్రోహం చేస్తున్నాయని, హైబ్రిడ్ కలుపు మొక్కలా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారని మండిపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Jagadeesh

Jagadeesh

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)కు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth), బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి మళ్లీ తెలంగాణ ప్రజలపై ద్రోహం చేస్తున్నాయని, హైబ్రిడ్ కలుపు మొక్కలా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి కాలంలో కృష్ణా నీటిని ఆంధ్రకు తరలించగా, ఇప్పుడు చంద్రబాబు గోదావరి నీరుపై కన్నేశాడని ఆరోపించారు. వీరిద్దరి కుట్రకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం దారుణమని విమర్శించారు.

AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ

తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమవుతుందని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమైందని, ఇప్పుడు అదే నాయకత్వం తెలంగాణ జలాలను, హక్కులను కాపాడగలదన్నారు. రేవంత్ పాలనతో ప్రజలు మళ్లీ కరువు, కాటకాల బారిన పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పందించని రేవంత్, బాబు, మోడీ లాంటి నేతలపై కేసీఆర్ పోరాటం చేస్తారని హెచ్చరించారు.

తెలంగాణ హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఉద్యమాన్ని మొదలు పెట్టనుందని, ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలపై వేలాది కేసులు పెట్టినప్పటికీ తమ పార్టీ వెనక్కి తగ్గదని చెప్పారు. తెలంగాణను మళ్లీ న్యాయం కలిగించే దిశగా ప్రజల చైతన్యాన్ని నమ్ముకొని ముందుకు సాగుతామని, కేసీఆర్ నాయకత్వమే భవిష్యత్తులో తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తుందని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.

  Last Updated: 23 Jun 2025, 12:28 PM IST