తెలంగాణలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా భావించబడుతున్న మల్లారెడ్డి కుటుంబం(MallaReddy Family)పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) మరోసారి తన దృష్టి సారించింది. గురువారం రోజు మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో ఉన్న మాజీ మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రా రెడ్డి (Bhadrareddy) నివాసంపై ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులు మల్లా రెడ్డి హాస్పిటల్స్ మరియు మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన ఆర్థిక లావాదేవీల పరిశీలనకు కొనసాగింపుగా చోటుచేసుకున్నాయి. భద్రా రెడ్డి, మల్లా రెడ్డి హాస్పిటల్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండటంతో, అనుమానాస్పద నగదు లావాదేవీలపై ఆధారాల మేరకు ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం.
సోదాల సమయంలో ఐటీ అధికారులు భద్రా రెడ్డి కుటుంబ సభ్యులను, స్టాఫ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లోద్దని ఆదేశించారు. గతంలో కూడా Enforcement Directorate (ED) మరియు ఐటీ శాఖలు మల్లా రెడ్డి కుటుంబానికి చెందిన పలు ఆస్తులపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీగా లెక్కలలోనికి రాని నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.
Donald Trump: భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వొద్దు.. ట్రంప్ సంచలన ప్రకటన!
ఈసారి దాడులకు సంబంధించిన కాలపరిమితి, రాజకీయ పరిణామాలతో కూడిన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భద్రా రెడ్డి భార్య ప్రీతి రెడ్డి హైదరాబాద్‌లో బీజేపీ నేతలను కలవడం, అలాగే బోనాల సందర్భంగా బీజేపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత వెంటనే దాడులు జరగడం, వాటి వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలకు తావిస్తుంది.
మొత్తంగా చూస్తే.. మల్లా రెడ్డి కుటుంబంపై జరుగుతున్న ఈ దాడులు రాజకీయంగా కీలకంగా మారాయి. స్థానిక ఎన్నికల సమీపంలో ఉన్న తరుణంలో ఇటువంటి పరిణామాలు అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసే అవకాశముంది. దాడుల వెనుక ఉన్న అసలు కారణాలు, దొరికిన ఆర్థిక ఆధారాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే భవిష్యత్‌లో ఈ దర్యాప్తులు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది.