IT Raids : మంత్రి సబిత బంధువుల ఇళ్లు.. ఓ ఫార్మా కంపెనీపై ఐటీ రైడ్స్

IT Raids : తెలంగాణలో పోలింగ్‌కు 17 రోజుల టైమే మిగిలింది. ఈ కీలక సమయంలో హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - November 13, 2023 / 08:57 AM IST

IT Raids : తెలంగాణలో పోలింగ్‌కు 17 రోజుల టైమే మిగిలింది. ఈ కీలక సమయంలో హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ మొదలయ్యాయి. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బందికి చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. నగరంలోని దాదాపు 15 ప్రదేశాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదు అందడంతో రైడ్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులకు ఫార్మా కంపెనీలు ఫండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు ఇంకొందరు చెబుతున్నారు. మరోవైపు మై హోం భూజాలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఐటీ రైడ్స్  వివరాలు.. 

  • నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయనకు చెందిన ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు.
  • నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసుల సోదాలు(IT Raids) జరిగాయి.
  • నవంబరు మొదటివారం ప్రారంభంలోనే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసాలలోనూ ఐటీ దాడులు జరిగాయి.
  • పది రోజుల క్రితం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా ఏకకాలంలో 18 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఈసారి ఎన్నికల్లో రఘువీర్ నాగార్జున సాగర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు.

Also Read: Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం