Telangana Election Effect : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం

  • Written By:
  • Updated On - October 5, 2023 / 11:12 AM IST

మరోసారి హైదరాబాద్ లో ఐటీ సోదాలు (IT Raids ) కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( BRS MLA Maganti Gopinath) ఇంట్లో, ఆఫీస్ లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మాగంటి గోపినాథ్ సోదరులతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఈరోజు ఉదయం నుండి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 100 ఐటీ బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు (Telangana Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం వంటివి జరుగుతాయి అనే కోణంలో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కూకట్ పల్లి ఇందూ ఫార్ట్చ్యూన్‌ విల్లాలు, మూసాపేట్లో వసంతనగర్ లోనూ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకే టైమ్ లో మొత్తం 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. 50 బస్సుల్లో వంద టీమ్‌లతో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం.

చిట్‌ఫండ్‌ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్‌గా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమీర్‌పేట్, శంషాబాద్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. శంషాబాద్‌లోని ఈకామ్ చిట్ ఫండ్స్‌లో కూడా అధికారులు రైడ్స్ నిర్వహించారు. 8 ఎకరాల్లో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్ సంస్థ యజమాని రఘువీర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

అలాగే అమీర్‌పేట్ పూజకృష్ణ చిట్ ఫండ్స్ సంస్థపై 20 టీమ్స్ ,డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజలక్ష్మీ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్ళల్లో, కూకట్‌పల్లి ఇందు ఫార్చ్యూన్ విల్లాలో అరికపూడి కోటేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతోనే రైడ్స్ నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం తెలంగాణ లోనే కాదు తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ జగత్​ రక్షకన్​పై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఎంపీ ఇంటితో పాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు జరుపుతున్నారు. అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఎంపీ.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్నులు చెల్లించలేదన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు అంటున్నారు.

Read Also : Nara Lokesh : నేడు విజ‌య‌వాడ‌కు నారా లోకేష్‌.. రేపు చంద్ర‌బాబుతో ములాఖ‌త్‌