Site icon HashtagU Telugu

IT Raids – Hyderabad : చిట్ ఫండ్స్ కంపెనీలపై ఐటీ రైడ్స్.. 100 టీమ్స్ తో సోదాలు

IT Raids

It Raids Hyderabad

IT Raids – Hyderabad : రెండోరోజు (శుక్రవారం) కూడా హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నగరంలోని పలు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థలు ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డాయని సమాచారం అందడంతో ఈ రైడ్స్  ను ఆదాయపు పన్ను విభాగం చేస్తోంది. ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు చిట్‌ఫండ్‌ సంస్థలతో పాటు వాటిలో భాగస్వామ్యం ఉందని భావిస్తున్న స్తిరాస్థి వ్యాపారులు, రైల్వే కాంట్రాక్టర్ల ఇళ్లలో 100 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. సిటీలోని ఎల్లారెడ్డిగూడ, సాయిసారథినగర్‌లలో ఉన్న పూజాకృష్ణ చిట్‌ఫండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో రైడ్ జరుగుతోంది. శంషాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై రెండో రోజు(శుక్రవారం) కూడా ఐటీ రైడ్స్ కొనసాగాయి. శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చునాలో కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

పూజాకృష్ణ చిట్‌ఫండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కు కృష్ణప్రసాద్‌ దొప్పలపూడి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సోమేపల్లి నాగరాజేశ్వరి, దొప్పలపూడి పూజాలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్నారు. కార్యాలయం ఎదురుగానే ఉన్న వీరి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో దాదాపు 10 వాహనాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత మధ్య వచ్చిన అధికారులు ఏకకాలంలో కార్యాలయం, ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇక ఇదే సమయంలో మరో పది వాహనాల్లో అధికారులు అమీర్‌పేటలోని పాన్‌కామ్‌ బిజినెస్‌ సెంటర్‌లో ఉన్న జీవన్‌శక్తి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తనిఖీలు (IT Raids – Hyderabad)  చేశారు.

Also read : CM Breakfast Scheme : తెలంగాణ సర్కార్ బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం