New Year Guidelines: హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలకు క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, 3 స్టార్ ఆపై హోటల్స్ నిర్వాహకులకు సీపీ CV ఆనంద్ తాజాగా మార్గదర్శకాలు (New Year Guidelines) జారీ చేశారు. ఈ నెల 31/ జనవరి 1న రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు అనుమతి తప్పనిసరని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 గంటల వరకే డీజే అనుమతిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తప్పనిసరి అన్నారు.
సీపీ జారీ చేసిన మార్గదర్శకాలు
- పబ్‌లు, స్టార్ హోటల్స్, బార్లపై ప్రత్యేక నిఘా
- డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు
- రహస్యంగా డ్రగ్స్ వినిగిస్తే ఆయా పబ్బులు, నిర్వాహకులపై చర్యలు
- డ్రగ్స్ సీక్రెట్‌గా విక్రయించే ప్రదేశాలపై నిర్వాహకులు నిఘా
- షీ టీమ్స్ ప్రత్యేక నిఘా
- డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌లో పట్టుబడితే చర్యలు
- 15 రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
- వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశాలలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- అశ్లీల డాన్సులు, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు
- ఔట్ డోర్ లో రాత్రి పది గంటల వరకే సౌండ్ సిస్టమ్, మ్యూజిక్‌కు అనుమతి
- ఇన్ డోర్ మ్యూజిక్‌కు రాత్రి 1 గంట వరకు అనుమతి
- పాసులు, టికెట్స్ సామర్ధ్యానికి మించి ఇవ్వకూడదు
- లా అండ్ ఆర్డర్ ఇబ్బందుకు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి