Site icon HashtagU Telugu

Minister Ponnam: బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి

Minister Ponnam

Minister Ponnam

Minister Ponnam: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైన మోదీ గ్యారెంటీలపైన బీజేపీ 2014, 2019, 2024 ఎన్నికల సందర్భంగా తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై బహిరంగంగా చర్చించడానికి బీజేపీ నేతలు సిద్ధమా..? అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Minister Ponnam) ప్ర‌శ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా బీజేపీ నేతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చివాట్లు పెట్టారు. ప్రధానమంత్రి బీజేపీ నాయకులను హెచ్చరించిన మాట వాస్తవం కాదా…? అని అన్నారు.

ప్రధానమంత్రి హెచ్చరిక కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టింగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మాట వాస్తవం కాదా..? అని ప్ర‌శ్నించారు.

Also Read: Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేపర్ దూరం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన పేరును “కిస్మత్” రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది. కిషన్ రెడ్డి ఎంపీకి ఎక్కువ. కేంద్రమంత్రికి తక్కువ. ఆయన తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కాదు.. ఆయన అంబర్ పేట్ నియోజకవర్గానికే అధ్యక్షుడు. ఈ మాట మేం చెప్పడం కాదు, వాళ్ల పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ “మోడీ గ్యారెంటీ” పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది.మోడీ గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చిందో… చర్చించడానికి మేం సిద్ధం. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారా..? అని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీములు, మోదీ ఇచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధమా..? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా మభ్యపెట్టి మోసం చేసిందని తెలిపారు. మోదీ గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చిందో… చర్చించడానికి మేం సిద్ధం. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. 2014 నుంచి 2024 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్ధమా? రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు 54 వేల కోట్లు ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వానిది. దీనిపై చర్చిద్దామా..? ఇది బీజేపీ నాయకులకు కనపడటం లేదా..? అని ప్ర‌శ్న‌లు సంధించారు.