Site icon HashtagU Telugu

KTR Tweet: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?: కేటీఆర్‌

KTR Tweet

KTR Tweet

KTR Tweet: తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పార్టీ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు చేస్తోంది. అయితే సీఎం రేవంత్ సర్కార్ ఇటీవ‌ల అమ‌లు చేసిన రైతు రుణ‌మాఫీపై ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ రైతులంద‌రికీ కాలేద‌ని ఆరోపిస్తుంది. మ‌రోవైపు ఇప్ప‌టికే చాలామంది రైతుల‌కు రుణ‌మాఫీ చేశామ‌ని, కొన్ని త‌ప్పుల వ‌ల‌న కొంద‌రి రైతుల‌కు రుణ‌మాఫీ కాలేద‌ని సంబంధిత శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా కోదాడ‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Tweet) త‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. అందులో కాంగ్రెస్‌ను విమ‌ర్శ‌లు చేస్తూ మండిప‌డ్డారు.

తాజాగా కోదాడ‌లో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణ‌మాఫీ కాలేదంటూ నిర‌స‌న చేప‌ట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వ‌ద్ద కూర్చొని త‌మ‌కు రుణ‌మాఫీ కాలేదంటూ నిర‌స‌న చేప‌ట్టారు. ఆ రైతుల‌పై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే అక్క‌డ‌కు చేరుకున్న మ‌హిళా పోలీస్ అధికారి రైతుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. ధ‌ర్నా ఎందుకు చేస్తున్నారని ప్ర‌శ్నించింది..? ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కోసం ఇంత చేస్తున్నారా..? అయితే మిమ్మ‌ల్ని జైలులో వేస్తా అదే ల‌క్ష రూపాయ‌లు పెట్టి కోర్టుల‌కు తిరుగుతా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్‌. అంతేకాకుండా రైతులంద‌ర్నీ క‌స్టడీలోకి తీసుకోవాల‌ని త‌న పోలీస్ సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్య‌క్తి పోస్ట్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నాడు.

Also Read: Relaxation Help Weight Loss: విశ్రాంతి తీసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గొచ్చా..?

తాజాగా ఈ వీడియోపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…? అంటూ ఆయ‌న త‌న ఎక్స్ ఖాతా ద్వారా కాంగ్రెస్‌ను విమ‌ర్శించారు.