Telangana Congress : సీఎం రేవంత్ సీనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారా ? లేదా ?

Telangana Congress :  సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలైంది.

  • Written By:
  • Updated On - March 10, 2024 / 10:23 AM IST

Telangana Congress :  సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలైంది. కానీ భట్టి విక్రమార్క సహా ఇతర సీనియర్ నేతలు  కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగారు. అయినా మాస్ లీడర్‌గా పేరుగాంచడం, అద్భుతమైన వాక్పటిమ ఉండటంతో రేవంత్‌కే సీఎంగా ఛాన్స్ వరించింది. మొదటి నుంచి కూడా సీనియర్లను కలుపుకొని రేవంత్ ముందుకు సాగుతున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్లు అందరూ సైలెంటై పోయి ఎవరి పనిని వారు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల న్యూస్ పేపర్లలో ఇచ్చిన పలు ప్రకటనల్లో భట్టి విక్రమార్క ఫొటో కనిపించలేదు.  ఈ ఒక్క అంశాన్ని చూపించి కొంతమంది రేవంత్‌ను విమర్శించే యత్నం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

టీమ్ వర్క్‌కే రేవంత్ ప్రాధాన్యత

వాస్తవానికి సీఎం రేవంత్(Telangana Congress) టీమ్ వర్క్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇటీవల ఆదిలాబాద్ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ‘‘ముఖ్యమంత్రిని నేనే కానీ భట్టి విక్రమార్క అన్న దగ్గరే చెక్ పవర్ ఉంటుంది’’ అని రేవంత్ చెప్పడాన్ని బట్టి ఆయన భట్టికి ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. తన కంటే భట్టి  విక్రమార్క పవర్ ఫుల్ అన్న సందేశాన్ని రేవంత్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన భట్టి విక్రమార్కకు… ఆ స్థాయి గౌరవాన్ని మొదటి నుంచీ రేవంత్ ఇస్తున్నారు.  ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో గతంలో కేసీఆర్ ఉన్న భవనాన్ని భట్టి విక్రమార్కకు కేటాయించారు. కానీ రేవంత్ మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు.

Also Read :Sea Turtle Meat : సముద్ర తాబేలు మాంసానికి 9 మంది బలి.. 78 మందికి అస్వస్థత

వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా కాకుండా.. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి సీఎం అయినప్పుడు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఉండేవారు. వారందర్నీ క్రమంగా తన దారిలోకి తెచ్చుకున్నారు.  తన పదవికి ఎవరూ అడ్డు రాకుండా వారికి కావాల్సిన పదవులు ఇచ్చి  తానే లీడర్‌ని అని అనిపించుకున్నారు.  ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే విధంగా చేస్తున్నారనే దుష్ప్రచారం చేసేందుకు కొందరు యత్నిస్తున్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్‌కు కీలకమైన ఇరిగేషన్ శాఖను రేవంత్ అప్పగించారు. సీనియారిటీ ఆధారంగా ఈ అవకాశాలను కేటాయించారు. వారిపై పెత్తనానికి సీఎం రేవంత్ యత్నించిన దాఖలాలు గత కొన్ని నెలల్లో ఒకటి కూడా లేదు. ఎవరినీ లెక్క చేయకుండా కామెంట్స్ చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి  లాంటి నేతలు కూడా రేవంత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటాన్ని మనమంతా చూస్తున్నాం. దీన్నిబట్టి సీనియర్లకు కాంగ్రెస్‌లో ఎంతటి  ప్రాధాన్యత దక్కుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.  ఇక ముఖ్యమైన హోం, మున్సిపల్ సహా కీలక శాఖలు రేవంత్ దగ్గరే ఉన్నాయి. మంత్రి వర్గంలో మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వచ్చే కీలక నేతలకు, పార్టీలోని సీనియర్లకే ఆ అవకాశాలను కట్టబెట్టే ఛాన్స్ ఉంది.

Also Read : Musi River: మూసీ నది ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

లోక్‌సభ ఫలితాల తర్వాత.. 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగినన్ని సీట్లు వస్తే సీఎం రేవంత్ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. దాని వల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన సరికాదు. రాజకీయ పార్టీకి రాబోయే విజయం టీమ్ వర్క్ వల్లే తప్ప ఒంటరి పోరాటం వల్ల కాదని గుర్తుంచుకోవాలి. ఈ విషయం కాంగ్రెస్ హైకమాండ్‌కే కాదు.. ఓటు వేసే సామాన్యులకు కూడా తెలుసు.