Site icon HashtagU Telugu

Telangana : ‘‘ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా?’’.. కేంద్రానికి మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్న

Thousand Jobs In Telangana

Thousand Jobs In Telangana

Telangana : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్‌బాబు మండిపడ్డారు.  ‘‘ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.  ‘‘తెలంగాణ రాష్ట్రం మన దేశంలోనే అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌. తెలంగాణ ప్రమేయం లేకుండా మనదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అవుతుంది ? ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా?’’ అని కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు. తెలంగాణ(Telangana) అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్ నెస్ తనిఖీ, తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ తదితర అంశాలపై చర్చించారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కేటాయింపుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘దేశంలోని రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా కేంద్ర బడ్జెట్‌ ఉంది. విభజన చట్టం హామీల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. విభజన చట్టంలో మనకు రావాల్సినవి ఏమీ రాలేదు’’ అని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ‘‘ఏపీకి కేంద్రం ఏం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇరు రాష్ట్రాలకు విభజన చట్టం ఒక్కటే అయినప్పుడు తెలంగాణకు కేటాయింపులు ఎందుకు ఇవ్వలేదు ? బీజేపీకి మద్దతిస్తున్నారు కనుక ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చారు. తెలంగాణ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు’’ అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

Also Read :Mr Smile : ‘మిస్టర్‌ స్మైల్‌’.. ఉద్యోగుల నవ్వును స్కాన్ చేస్తాడు

ఇతర రాష్ట్రాలకు ఐఐఎంలు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఎందుకు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు పెండింగ్ నిధులు  ఎందుకు ఇవ్వలేదన్నారు. ‘‘హైదరాబాద్‌, ఫార్మా క్యాపిటల్‌ అని మరిచిపోయారా ? ఇక్కడి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహించడం లేదు ?’’ అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్‌లో మంచి ఎకో సిస్టం ఉందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. మెడికల్ డివైజస్‌ పార్కు, మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులు కోరినా కేంద్రం కేటాయింపులు చేయలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదగిరిగుట్ట ఊసేలేదని మంత్రి తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావనే లేదని చెప్పారు.  పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మరచిపోయారని శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మండిపడ్డారు.

Exit mobile version