Site icon HashtagU Telugu

Nehru Zoological Park : హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కు ను తరలిస్తున్నారా..?

Is Nehru Zoo Park Being Rel

Is Nehru Zoo Park Being Rel

హైదరాబాద్ (Hyderabad) లోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Nehru Zoological Park) ను తరలిస్తున్నారా..? ప్రస్తుతం ఈ వార్త జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తుంది. వీకెండ్ వచ్చిన..ఏదైనా పండగల సెలవులు వచ్చిన జంతు ప్రేమికులు నెహ్రూ జూలాజికల్ పార్కు వద్ద వాలిపోతారు. తమ పిల్లలకు పార్క్ లోని జంతువులను , పక్షులను చూపించి వారిని సంతోషపెడతారు. అలాంటి ఏళ్ల నాటి పార్క్ ను ఇప్పుడు సిటీ నుంచి దూరంగా తరలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్‌ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నా..2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అదిసాధ్యం కాలేదు. తాజాగా ఇదే అంశం మళ్లీ తెరమీదికి రావడం చర్చనీయాంశమైంది. నెహ్రూ జూలాజికల్‌ పార్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి పూర్వపు జూ ఎన్‌క్లోజర్‌లను మార్చిన తర్వాత 1963లో బహదూర్‌పురాలో ప్రారంభించారు. 380 ఎకరాల్లో విస్తరించిన ఈ జూపార్క్‌ అపుడు హైదరాబాద్‌ వెలుపల ఉన్నా ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా మారింది. దీంతో నిత్యం ధ్వని కాలుష్యం తో పాటు మీర్‌ఆలం ట్యాంక్‌ నుంచి వరదనీరు జంతుప్రదర్శనశాలలోని కొంత భాగాన్ని మొంచేస్తున్నాయి. ఇలా పలు కారణాలతో ఈ పార్క్ ను షాద్‌నగర్‌ కు తరలిస్తున్నారని అంటున్నారు.

షాద్‌నగర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించినట్టు సమాచారం. షాద్‌నగర్‌ రెవెన్యూ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న కమ్మదనం రిజర్వ్‌ ఫారెస్ట్‌ 824 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది నగరానికి దూరంగా ఉన్నందున కాలుష్యం లేకుండాజంతుప్రదర్శనశాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. నగరానికి 45 కి.మీ దూరానికి తరలిస్తే సందర్శకుల రద్దీ తగ్గుతుందని, అలాగే జంతు ప్రేమికులకు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్క్ ను తరలించవద్దని కోరుతున్నారు. మరి నిజంగా పార్క్ ను తరలిస్తున్నారా..లేదా అనేది ప్రభుత్వ అధికారులు తెలియజేయాలి.

Read Also : AP Cabinet: జూన్ 24న ఏపీ కేబినెట్ భేటీ