BRS To TRS : కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారా ? భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పేరును తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా మార్చబోతున్నారా ? బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ పేరే బెటర్ అనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చారా ? అనే అంశాలపై ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో లోలోపల హాట్ డిస్కషన్ నడుస్తోంది. తన పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు అయితేనే బెటర్ అని.. ఈమేరకు మార్పులు చేస్తే బాగుంటుందని ఒకానొక దశలో కేసీఆర్ అభిప్రాయపడ్డారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఏది చేసినా.. ఒక మంచి ముహూర్తం కావాల్సిందే. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చేందుకు కూడా ఒక ముహూర్తాన్ని ఆయన ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల (ఏప్రిల్) 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Also Read :Telangana Budget : నేడు తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులపై అంచనాలివీ
టీఆర్ఎస్ పేరుతో ఎన్నో విజయాలు..
- టీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ ఎన్నో విజయాలను అందుకున్నారు.
- తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ పేరు ఇంటింటికి చేరింది.
- తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో తెలంగాణ ఉద్యమ పార్టీని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఏర్పాటు చేశారు.
- 2001 నుంచి 2014 వరకు ఏకంగా 13 ఏళ్లకుపైనే ఎన్నో విజయాలను టీఆర్ఎస్ అందుకుంది.
- టీఆర్ఎస్ అంటేనే తెలంగాణా అనేలా జనం మనసుల్లో ఆ పేరు నిలిచిపోయింది.
- టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచి తెలంగాణాలో కేసీఆర్ అధికారంలో వచ్చారు.
- 2018లో గెలిచాక కేసీఆర్ ఫోకస్ జాతీయ రాజకీయాలపై పడింది. కొంత మంది సన్నిహితుల సలహాలు ఆయన ఆలోచనను మార్చాయి.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేలా చేశాయి.
- 2022 డిసెంబర్ 9న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు.
- పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చాక.. తెలంగాణ కంటే పొరుగు రాష్ట్రాలపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల రాష్ట్రంలో పార్టీ దెబ్బతింది.
- అప్పట్లో ప్రశాంత్ కిశోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు ఇచ్చిన తప్పుడు సలహాలు పనిచేయలేదు. బీఆర్ఎస్ అంతగా రాణించలేకపోయింది. జాతీయ రాజకీయాల విషయంలో భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయలేకపోయింది.
- 2023 డిసెంబరులో జరిగిన తెలంగాణా శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఘోర పరాజయం ఎదురైంది.
- 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జీరో నంబర్ వచ్చింది.