Site icon HashtagU Telugu

IRS Officer : ఐఆర్ఎస్ అధికారిణి సంచలన నిర్ణయం.. మహిళ నుంచి పురుషుడిగా మారిన వైనం

Irs Officer Gender Changed

IRS Officer : ఆమె కాస్తా ఆయనగా మారింది. ఆమె ఒక సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS Officer) అధికారిణి. ప్రభుత్వ, ఉద్యోగ అధికారిక రికార్డులలో తన పేరును, లింగాన్ని పురుషుడిగా మార్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. మన దేశ సివిల్  సర్వీసు చరిత్రలో ఇలాంటి  నిర్ణయాన్ని తీసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ఆ అధికారిణి ఎవరు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఆ ఐఆర్ఎస్  అధికారిణి అసలు పేరు ఎం.అనసూయ(M Anusuya).  వయసు 35 ఏళ్లు. మన హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోని చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. ఐఆర్ఎస్ ఆఫీసర్లు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తారు. అందుకే తన పేరును, లింగాన్ని అధికారిక రికార్డుల్లో మార్చాలంటూ ఆమె కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు పంపారు. దానికి ఎట్టకేలకు ఆమోదం లభించింది. దీంతో అనసూయ పేరు అనుకథిర్ సూర్యగా(M Anukathir Surya) మారింది. ఆమె స్త్రీ లింగం నుంచి పురుష లింగానికి మారారు. ఇకపై ఆమెకు సంబంధించిన అన్ని ప్రభుత్వ రికార్డుల్లోనూ అనసూయకు బదులు అనుకథిర్ సూర్య అనే పేరే వస్తుంది.

Also Read :Teeth Whiten: ఈ ఫుడ్స్ మీ దంతాల‌ను ర‌క్షించ‌డ‌మే కాకుండా.. తెల్ల‌గా మెరిసేలా చేస్తాయ‌ట‌..!

అనుకథిర్ సూర్య (అనసూయ) తమిళనాడు వాస్తవ్యురాలు. ఆమె చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమాను పూర్తి చేశారు. తొలిసారిగా 2013 డిసెంబరు చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన కెరీర్‌ను అనసూయ ప్రారంభించారు. 2018 సంవత్సరం నాటికి డిప్యూటీ కమిషనర్ ర్యాంకుకు పదోన్నతి పొందారు. గత సంవత్సరమే అనసూయకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయింది.

Also Read :PM Modi: ప్ర‌ధాని మోదీకి ర‌ష్యా అత్యున్న‌త పౌర పుర‌స్కారం..!