తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగాన్ని(Telangana State Tourism Sector) అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కీలక అడుగులు వేస్తోంది. తాజాగా నిర్వహించిన టూరిజం కాంక్లేవ్‌లో రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరినట్లు సీఎంఓ (CMO) ప్రకటించింది. ఈ పెట్టుబడులు పర్యాటక మౌలిక వసతులు, వినోద ప్రాజెక్టులు, సాహస క్రీడలు, సాంస్కృతిక పర్యాటక కేంద్రాలు వంటి విభిన్న రంగాల్లో వినియోగించబడనున్నాయి. దీంతో రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చనుంది.
Tulasi Plant: తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!
మొత్తం 30 ప్రాజెక్టుల ద్వారా 19,520 మందికి ప్రత్యక్షంగా, మొత్తం 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు సీఎంఓ వివరించింది. ఇందులో 14 పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ప్రాజెక్టులు, 16 ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యాటక సదుపాయాలు మెరుగుపడి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలు, సహజసిద్ధమైన ప్రదేశాలు అభివృద్ధి చెందుతాయి.
రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ పెట్టుబడుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో రిసార్ట్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కులు, ఈకో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రాష్ట్రానికి పర్యాటకుల ప్రవాహం గణనీయంగా పెరగడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉత్సాహం లభిస్తుందని అధికారుల అంచనా. ఇలా తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త దిశలో ముందడుగు వేసింది.