బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను కొద్దీ సేపటి క్రితం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అసలు కవిత ఫై ఈడీ అధికారులు ఏ కేసు పెట్టారనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ED అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసులు బయటకు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ చట్టం 2022(15 of 2003) కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు నోటీసు లో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె మనీలాండరింగ్కు పాల్పడినట్లు, ఈ కేసుకు సంబదించిన వారిలో ఈమె ముఖ్యమైందని పేర్కొని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు (శుక్రవారం) సా.5.20 గంటలకు ఆమెను అరెస్ట్ చేసినట్లు ED అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అరెస్టుకు గల కారణాలపై 14 పేజీలతో కూడిన నోటీసులను కవితకు ఈడీ అందించింది. ఈ నోటీసుల ఫై కవిత స్పందిస్తూ..ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని , అక్రమ అరెస్ట్ ను శాంతియుతంగా , న్యాయపరంగా ఎదురుకుంటామని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈడీ అధికారులు కవితను ఢిల్లీ కి తీసుకెళ్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కవిత అరెస్ట్ ను చట్టపరంగా ఎదుర్కొంటాం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ‘కవితను ఈడీ అరెస్ట్ చేయడం అన్యాయం. కవితకు తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికతోనే ఆమెను అరెస్ట్ చేశారు. తెలంగాణ గొంతుకను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తోంది. బీజేపీ కుట్రలను దేశం గమనిస్తోంది. పిట్ట బెదిరింపులకు భయపడం అని వేముల చెప్పుకొచ్చారు.
Read Also : Kavitha Arrest : కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు