Hyderabad : శ్రీ చైతన్య ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం

హైదరాబాద్ (Hyderabad) లో మరో విద్యార్థి (Intermediate First Year Student) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొద్దీ రోజులుగా ఇంటర్ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నా సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని ఫీర్జాదిగూడ (Peerzadiguda) శ్రీ చైతన్య కాలేజ్‌ (Sri Chaitanya )లో ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్ష (Varsha) బలవన్మరణానికి పాల్పడింది. నిన్న మధ్యాహన భోజన సమయంలో హాస్టల్‌కి వెళ్లి ఉరి వేసుకొని […]

Published By: HashtagU Telugu Desk
AP Student Suicide

హైదరాబాద్ (Hyderabad) లో మరో విద్యార్థి (Intermediate First Year Student) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొద్దీ రోజులుగా ఇంటర్ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నా సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని ఫీర్జాదిగూడ (Peerzadiguda) శ్రీ చైతన్య కాలేజ్‌ (Sri Chaitanya )లో ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్ష (Varsha) బలవన్మరణానికి పాల్పడింది. నిన్న మధ్యాహన భోజన సమయంలో హాస్టల్‌కి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

చదువు విషయంలో వర్షపై కాలేజీ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ర్యాంకుల కోసం విద్యార్థులను బలితీసుకుంటున్నారని మండిపడుతున్నారు. కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడంతో గత రాత్రి నుంచి కాలేజ్ వద్ద ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. కాలేజీకి యాజమాన్యం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి మార్చురీలో విద్యార్థిని మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు.

Read Also : Viral Tweet : సీఎం రేవంత్ ను కట్టిపడేసిన ‘సలార్’ సాంగ్..

  Last Updated: 29 Dec 2023, 03:42 PM IST