Medigadda Project : అంతరార్ధం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలించారు. అక్కడికి వచ్చే లారీల్లోకి ఇసుకను నింపాలి. ఈ పని చేసేందుకు ఆసక్తితో ఉన్న కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించారు. ఒక్కో టన్ను ఇసుక లోడింగ్‌కు రూ.97 ఖర్చవుతుందని తెలంగాణ ప్రభుత్వ మైనింగ్ విభాగం(టీజీఎండీసీ) అంచనా వేసింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ పనుల కోసం బిడ్లు దాఖలు చేసిన వారు అంతకంటే 25 శాతం తక్కువ రేటుకు పనిచేస్తామని ఆసక్తిని వ్యక్తపరిచారు. కొందరైతే టన్ను ఇసుక లోడింగ్(Sand Loading Tenders) పనిని కేవలం రూ.72.76కే చేస్తామని ప్రతిపాదనలు సమర్పించారు.
We’re now on WhatsApp. Click to Join
అంచనా వ్యయం కంటే తక్కువ రేటు బిడ్లు దాఖలు చేయడంపై సదరు కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తక్కువ రేటుకు ఇసుక లోడింగ్ చేయడం సాధ్యమా ? ఏవైనా అక్రమాలకు పాల్పడే దురుద్దేశంతో ఇంత తక్కువకు బిడ్లు దాఖలు చేశారా ? అనే సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Project) ఎగువ ప్రాంతంలోని మహదేవపూర్, బెగులూర్, బ్రాహ్మణపల్లి, ఎల్కేశ్వరం, బొమ్మాపూర్‌లలో ఉన్న 14 ఇసుక రీచ్‌ల నుంచి 92 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. ఇసుక లోడింగ్ పనులు చేపట్టే కాంట్రాక్టర్లే యంత్రాలు తెచ్చుకోవాలి. మనుషులు, స్టాక్‌యార్డుకు అవసరమైన భూమి, లారీలకు పార్కింగ్, డ్రైవర్లకు కనీస సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా వాళ్లదే. ఇవన్నీ చేయాలంటే ప్రతీ టన్ను ఇసుక లోడింగ్‌కు కనీస రేటును పొందాలి. మరి అతి తక్కువ రేటుకు ఆ పనిని చేసేందుకు ఎందుకు ముందుకొస్తున్నారు ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
Also Read :West Bengal Bypolls : నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీకి విజయం ఖాయం..!
టెండర్లు పిలిచిన అన్ని రీచ్‌లకు కలిపి తుది పరిశీలనలో 173 మంది పోటీపడ్డారు. వారంతా ఒకేరకంగా రూ. 72.76 కోట్ చేశారు. టన్ను ఇసుక లోడింగ్ పనిని రూ.72.76కే చేస్తామని చెప్పారు. దీంతో ప్రతి రీచ్‌లోనూ పోటీలో ఉన్న 173 మంది ఎల్-1గా అధికారులు నిలిచారు. మహదేవపూర్‌లో మొదటి 3 రీచ్‌లకు 14 మంది చొప్పున పోటీలో ఉన్నారు. ఎల్కేశ్వరం -2లో బిడ్లు దాఖలు చేసిన 13 మంది కూడా ఎల్-1గా ఉన్నారు. మిగతా ఇసుక రీచ్‌లలోనూ ఇదే స్థితి నెలకొంది.