Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

Telangana: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ప్రధాని మోడీ చాలా సార్లు రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడిగారని అయితే కాళేశ్వరాన్ని ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు రేవంత్. మేడిగడ్డ స్తంభాలు ఎందుకు మునిగిపోయాయో ప్రధాని అరా తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ తెలిపారు. కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని, బీఆర్‌ఎస్ నుంచి రక్షణ కోసం బీజేపీకి డబ్బులు అందుతున్నాయా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ లోపభూయిష్ట ప్రాజెక్ట్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని ఆయన కోరారు. మరోవైపు కాంట్రాక్టర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Also Read: Copter Crash: కోచిలో కూలిన హెలికాప్టర్, ఇద్దరికి తీవ్ర గాయాలు