లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Polls) పట్టుమని రెండువారాల సమయం కూడా లేదు..ఈ టైం లో కూడా బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండు నెలలుగా బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు రాగా..తాజాగా మరో కీలక నేత సైతం రాజీనామా చేయడం మరింత షాక్ కు గురి చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవి అనుభవించిన కీలక నేత , మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి (Indrakiran Reddy)..కొద్దీ సేపటి క్రితం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా అనంతరం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ రోజులుగా ఈయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ..ఆయన సైలెంట్ గా ఉండేసరికి చేరకపోవచ్చని అంత అనుకున్నారు. కానీ ఈరోజు అందరు అనుకుంటున్నట్లే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదు.
1980 క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఇంద్రకరణ్..జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా పనిచేశాడు. 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2008లో ఉపఎన్నికల తర్వాత 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు 10వ లోక్‌సభలో టీడీపీ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు. 2018లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019 నుండి తెలంగాణ దేవాదాయ, న్యాయ, అటవీ శాఖల మంత్రిగా ఉన్నాడు. 2014 జనరల్ ఎన్నికల్లో బి.ఎస్.పి. అభ్యర్థిగా నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 10వ, 14వ లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసారు.
Read Also : NTR – Prabhas : సలార్ 2ని పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్..