Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి. ఈ పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. స్థలం లేనివారికి స్థలాన్ని కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు స్వీకరించిన అప్లికేషన్లలోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం(Indiramma Houses) కోసం వచ్చిన అప్లికేషన్లను, రెండింటి కోసం వచ్చిన అఫ్లికేషన్లను వేరుచేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కో వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లయ్ చేశాడో తెలుసుకునేందుకు లెటేస్ట్ టెక్నాలజీని వాడబోతున్నారట. దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో సమర్పించిన దరఖాస్తులన్నీ ఒకేచోట చూపించే సాఫ్ట్ వేర్‌ను వాడబోతున్నారు. అనంతరం ఆయా దరఖాస్తుదారులను ఫోనులో సంప్రదిస్తారు. చివరకు వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి.. మిగిలిన చోట్ల అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపికచేయనున్నారు. పెళ్లిళ్ల తరవాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపజేయరు.
Also Read :Medaram Jatara 2024 : ‘మేడారం’ బస్సుల్లో మహిళలకూ టికెట్.. సర్కార్ స్పందన ఇదీ..
అప్లికేషన్లను ఫిల్టర్ చేశాక గ్రామసభలు నిర్వహించి.. అర్హులను గుర్తించనున్నారు. ప్రతి సంవత్సరం ఎంతమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలి ? ఇళ్ల నిర్మాణానికి సాయం చేయడానికి ఎన్ని నిధులు కేటాయించాలి ? అనే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయనున్నారు.తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ జర్నీ, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా పరిధి రూ.10 లక్షలకు పెంచారు. ఫిబ్రవరిలో మరో రెండు హామీలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.